Bro Movie Run Time | సరిగ్గా పదకొండు రోజులకు ఈ పాటికి బ్రో సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. టాక్ ఎలా ఉన్నా పవన్ క్రేజ్‌తో తొలిరోజు హంగామా ఎలాగూ ఉంటుంది. ఒకవేళ పాజిటీవ్ టాక్ గనుక వచ్చిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు మెగా అభిమానుల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. పైగా మామా అల్లుళ్లు కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అందరిలోనూ తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రయూనిట్ కత్తెర పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
కాగా తాజాగా ఈ సినిమా నిడివి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. బ్రో సినిమాకు క్రిస్పీ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల రన్టైమ్తో ప్రదర్శితం కానుందట. నిజానికి ఇది సినిమాకు చాలా ప్లస్ అయ్యే అంశమే. ఎందుకంటే అదనంగా షోలు ప్లాన్ చేసుకోవటానికి, త్వరగా ప్రదర్శనలు పూర్తి చేసుకుని ఆడియన్స్ ఇంటికి వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ మధ్య ఆడియెన్స్ సైతం తక్కువ రన్‌టైమ్ ఉన్న సినిమాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఇక పవన్ ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల తర్వాత ఉండబోతుందని ఇప్పటికే లీకైపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో దాదాపు 90 నిమిషాలు పవన్ కనిపించనున్నాడు. అంటే గంటన్నర సేపు పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడన్నమాట. నిజానికి ఒరిజినల్ వెర్షన్ సినిమాలో సముద్రఖని పాత్ర అంత సేపు ఉండదు. కానీ ఇక్కడ పవన్ క్రేజ్ దృష్ట్యా ఆయన పాత్రను పెంచినట్లు తెలుస్తుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ వంద కోట్లు దాటిందని సమాచారం.