తండ్రి సంరక్షణ నుంచి బ్రిట్నీ స్పియర్స్‌కు విముక్తి..

కాలిఫోర్నియా: తండ్రి సంరక్షణ నుంచి పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ విముక్తి పొందింది. 13 ఏళ్ల తర్వాత తన జీవితంలో ఇదే అత్యుత్తమ రోజు అని ఆమె అన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమకు 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతలను ఆమె తండ్రి తీసుకున్నారు. అయితే తనపై తండ్రి తీవ్ర వత్తిడి చేసినట్లు ఆమె ఆరోపించారు. ఆ కేసులో లాస్ ఏంజిల్స్ జడ్జి ఆమెకు విముక్తి కల్పించారు. స్పియర్స్‌కు మద్దతు తెలిపేందుకు లాస్ ఏంజిల్స్ కోర్టుకు భారీ సంఖ్యలో ఆమె ఫ్యాన్స్ వచ్చారు. బ్రిట్నీ తన తండ్రి సంరక్షణలో భౌతికంగా, ఎమోషనల్, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు ఆమె తరపు లాయర్లు వాదించారు.
గత 13 ఏళ్ల నుంచి తన తండ్రి వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆమె ఇటీవల కోర్టులో పేర్కొన్నది. సంరక్షణ స్థానం నుంచి తన తండ్రిని తప్పించాలని, ఆయన వద్ద ఉన్న నియంత్రణాధికారాలను తొలగించాలని బ్రిట్నీ కోర్టును వేడుకున్నది. 2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ కస్టడీలో ఉంటున్నది. అయితే తనపై తన తండ్రికి ఉన్న న్యాయపరమైన నియంత్రణను తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకున్నారు. 13 ఏళ్ల నరకం ఇక చాలు అని, తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్నదని, ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని చాన్నాళ్ల నుంచి ఆన్లైన్లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగించిన విషయం తెలిసిందే. సంరక్షణాధికారాలను తన తండ్రి దుర్వినియోగం చేసినట్లు బ్రిట్నీ ఆరోపించారు. పాప్ సింగర్ బ్రిట్నీ వయసు 39 ఏళ్లు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

