Brahmastra | ‘మనకున్న ఏకైక లక్ష్యం బ్రహ్మస్త్రం’.. విజువల్ వండర్‌గా అదరగొడుతున్న ట్రైలర్!
Brahmastra Trailer | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మస్త్ర’ ఒకటి. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేస్తున్నాడు. నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ శక్తులన్ని కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మస్త్రానిది. బ్రహ్మస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ’ అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత రణ్‌బీర్, అలియా మధ్య సన్నివేశాలు బాగున్నాయి. అగ్నితో తనకు ఏదో బంధం ఉన్నట్లు, అగ్ని తనను దహించలేదు అంటూ అలియాకు చెప్పడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ‘సహస్ర నందిమ్ సామర్థ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు’ అంటూ నాగార్జున అతీత శక్తులతో కనిపిస్తాడు. ‘మనకున్న ఏకైక లక్ష్యం.. బ్రహ్మస్త్రం’ అంటూ మౌనిరాయ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. 3నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ షాట్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ప్రీతమ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున కీలకపాత్రల్లో నటించగా మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

