పోక్సో కేసులో బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్‌కు ఊరట
Mahesh Manjrekar | ఓ మరాఠీ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించినందుకు బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో ) కేసులో ఇరుక్కున్నాడు. ఈ సన్నివేశంలో పిల్లలు ఉండటంతో ఆయనపై కేసు నమోదైంది. కేసు రిజిస్టర్ అయ్యాక తనను అరెస్టు చేయవద్దంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు మహేశ్ మంజ్రేకర్. వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం మహేశ్ మంజ్రేకర్‌ను గానీ గానీ ఆ చిత్ర బృందంలోని సభ్యులను గానీ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా నయ్ వరణ్భాత్ లోంచా కోన్ నయ్ కొంచా అనే మరాఠీ చిత్రంలో మహేశ్ మంజ్రేకర్ నటించాడు. ఈ సినిమా ట్రైలర్లో మైనర్లపై కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఇటీవల కేసు రిజిస్టర్ అయ్యింది. ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ కేసుపై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సినిమాలో ఇబ్బందికర సన్నివేశాలు లేవని, అయినప్పటికీ ట్రైలర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సినిమా టీమ్ తరఫున న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ కూడా ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న బాంబే హైకోర్టు మహేశ్, మంజ్రేకర్, చిత్ర బృందానికి ఊరటనిచ్చింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
గోపీచంద్ ఒక్కడున్నాడు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మహేశ్ మంజ్రేకర్.. తెలుగులో హోమం, డాన్ శీను, అదుర్స్, అఖిల్, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

