పిల్లల కోసం వినూత్న ప్రయత్నం
2020 కరోనా టైమ్‌లో సల్మాన్‌ఖాన్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. దాని పేరు ‘సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ మ్యూజిక్'. ఇప్పటికీ దానికి 30లక్షలమంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.
ఆయన అందులో స్వయంగా పాటలు పాడిన విషయం తెలిసిందే. తాజాగా సల్మాన్ మరో యూబ్యూబ్ ఛానల్‌ని ప్రారంభించారు. దాని పేరు ‘బీయింగ్ సల్మాన్‌ఖాన్’. తన తాజా యూట్యూబ్ ఛానల్‌పై సల్మాన్ మాట్లాడుతూ ‘ఈ ఛానల్ లోని వీడియోలు పెద్దల కోసం కాదు.. పిల్లల కోసం.
ఇందులోని కంటెంట్ పెద్దలకు నచ్చకపోవచ్చు. కానీ పిల్లలకు నచ్చుతుంది. వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతోపాటు పిల్లలకు విద్య కూడా అవసరం కదా.. అదే ఈ ఛానల్ అందిస్తుంది’ అంటూ సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక ఈ ఛానల్ విషయానికొస్తే.. ఇందులో సల్మాన్‌ఖాన్ షూటింగ్ విశేషాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ ఉండవు.
ఇందులో ఆయన నటన నేర్పే గురువుగా, విద్యార్థిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆయన శారీరకభాష, సంభాషణా చాతుర్యం, హావభావాలు పిల్లలకు అర్థమయ్యేలా ఉంటాయని తెలిసింది. ఓ అగ్ర నటుడు చేస్తున్న వినూత్న ప్రయత్నమిది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

