డీప్‌ఫేక్ వీడియోపై ఫిర్యాదు
కృతిమ మేథస్సుతో సృష్టించే డీప్‌ఫేక్ వీడియోలు సినీ తారలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రష్మిక మందన్న మొదలుకొని ఇప్పటికే పలువురు అగ్ర తారలను లక్ష్యంగా చేసుకొని క్రియేట్ చేసిన వీడియోలు బాలీవుడ్లో కలకలం రేపాయి.
కృతిమ మేథస్సుతో సృష్టించే డీప్‌ఫేక్ వీడియోలు సినీ తారలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. రష్మిక మందన్న మొదలుకొని ఇప్పటికే పలువురు అగ్ర తారలను లక్ష్యంగా చేసుకొని క్రియేట్ చేసిన వీడియోలు బాలీవుడ్లో కలకలం రేపాయి. తాజాగా ఓ పార్టీకి మద్దతుగా అగ్రహీరో రణ్‌వీర్‌సింగ్ మాట్లాడినట్లుగా తయారు చేసిన డీప్‌ఫేక్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వ్యవహారంపై రణ్‌వీర్‌సింగ్ ముంబయి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘డీప్‌ఫేక్ నుంచి రక్షించండి మిత్రులారా’ అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. రణ్‌వీర్‌సింగ్ డీప్‌ఫేక్ వీడియో వ్యవహారం వివరాల్లోకి వెళితే.. ఇటీవల రణ్‌వీర్‌సింగ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. అక్కడ పలు దేవాలయాలను దర్శించుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు.
రణ్‌వీర్‌సింగ్ చెప్పిన మాటలను ఏఐ సాంకేతికతో మార్చివేసి ఆయన ఓ రాజకీయ పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించినట్లుగా చూపించారు. ఈ వీడియో గంటల వ్యవధిలోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వెంటనే స్పందించారు రణ్‌వీర్‌సింగ్. ఫేక్ వీడియోను నమ్మొద్దని అభిమానులను కోరారు. రణవీర్‌సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

