స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నెట్వర్కింగ్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ముంబైలో శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ పాల్గొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ నెట్వర్కింగ్ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, బోనీకపూర్, ఏక్తా కపూర్, కృతి సనన్, భూమి పెడ్నేకర్, అనిల్ కపూర్, కిరణ్ రావు, రాజ్‌కుమార్ రావు, సోనాక్షి సిన్హా, పత్రలేఖ, శివానీ దండేకర్, గువహర్ ఖాన్ సహా పలువురు హాజరయ్యారు. భూమి పెడ్నేకర్, కృతి సనన్ కండ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌లో హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు.