Sara Ali Khan – Kedarnath Tour : బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్(ara Ali Khan) భక్తిపారవశ్యంలో మునిగి తేలుతోంది. ఈమధ్యే సారా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమేన కేదార్నాథ్(Kedarnath)కు వెళ్లొచ్చింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ వెళ్లి కేదార్నాథీశ్వరుడిని దర్శించుకుంది. చార్ధామ్ యాత్ర(Char Dham Pilgrimage)గా పిలిచే ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సారా సంగీతం వింటూ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు, బండరాయి మీద ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు, సాధువు ఆమెను ఆశీర్వదిస్తున్న ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
సారా కేదార్నాథ్ దేవాలయానికి వెళ్లడం ఇదేం మొదటిసారి కాదు. బాలీవుడ్లో తన మొదటి సినిమా’ కేదార్నాథ్’ షూటింగ్ కోసం ఆమె ఇక్కడే చాలా రోజులు ఉంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్( Sushant Singh Rajput), సారా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. ఆ తర్వాత లవ్ ఆజ్ కల్, లూకా చిప్పి, జరా హట్కే జరా బచ్కే వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమార్తె అయిన సారా.. అనతికాలంలోనే బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది