బాలయ్యకు విలన్గా బాబీడియోల్?
ఇన్నాళ్లూ తెలుగుకు మాత్రమే పరిమితమైన నందమూరి బాలకృష్ణ నిదానంగా ఇతర భాషలపై కూడా దృష్టి సారిస్తున్నారా? అంటే పరిస్థితులు ఔననే చెబుతున్నాయి. ఆయన రీసెంట్ హిట్ ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో విడుదల కానుంది. ఆ సినిమాకు బాలయ్యే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.
ఇన్నాళ్లూ తెలుగుకు మాత్రమే పరిమితమైన నందమూరి బాలకృష్ణ నిదానంగా ఇతర భాషలపై కూడా దృష్టి సారిస్తున్నారా? అంటే పరిస్థితులు ఔననే చెబుతున్నాయి. ఆయన రీసెంట్ హిట్ ‘భగవంత్ కేసరి’ త్వరలో హిందీలో విడుదల కానుంది. ఆ సినిమాకు బాలయ్యే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ‘భగవంత్ కేసరి’ హిందీ వెర్షన్లో బాలయ్య చెప్పిన హిందీ డైలాగులకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానికి తగ్గట్టుగానే ఇందులో పాత్రధారుల ఎంపిక కూడా జరుగుతున్నది.
ఇప్పటికే మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ని ఇందులో ఓ కీలక పాత్రకు తీసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ న్యూసేంటంటే.. ఈ సినిమాలో విలన్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీడియోల్ని ఎంపిక చేశారట మేకర్స్. అంతేకాదు, ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే.. తొలిసారి బాలయ్య పాన్ ఇండియా సినిమా చేయనున్నారన్నమాట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

