Blue Star Movie | తమిళ హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan), శంతను భాగ్యరాజ్(Shantanu Bhagyaraj) ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘బ్లూ స్టార్’ (Blue Star). ఈ సినిమాకు ఎస్. జయకుమార్ (S Jaya Kumar) దర్శకత్వం వహించగా.. తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ (PA. Ranjith) నిర్మించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి పాండియన్, పృథ్వీరాజన్, భగవతి పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, లిజీ ఆంటోని, దివ్య దురైసామి, అరుణ్ బాలాజీ, రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా టైంలోనే నటి కీర్తి పాండియన్‌తో లవ్‌లో పడిన అశోక్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని తిరుణవేలిలో ఈ వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
A Revolutionary Game-Changer 💙#BlueStar – Now Streaming on @PrimeVideoIN 🎥
Experience to get Inspired ✊🏿@beemji @BlueStarOffl @lemonleafcreat1 @SakthiFilmFctry @sakthivelan_b @chejai007 @imKBRshanthnu @AshokSelvan @prithviactor @iKeerthiPandian @dhivya_dhurai… pic.twitter.com/g8FRJc74vp
— Neelam Productions (@officialneelam) March 1, 2024