బాధ్యతతో కూడిన వరం
పెండ్లితో సినిమాల్లో జోరు తగ్గించిన సోనమ్ కపూర్ కొడుకు పుట్టాక కెరీర్‌కు కామా పెట్టింది. మళ్లీ మరో ఇన్నింగ్స్‌కు సిద్ధపడుతున్న సోనమ్ పదినెలలుగా తన కొడుకుతో ప్రతిక్షణాన్ని అద్భుతంగా ఆస్వాదించానని చెప్పుకొచ్చింది. ‘ప్రతి మహిళకూ అమ్మతనం బాధ్యతతో కూడిన వరం. మాతృత్వాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని సవాళ్లు కూడా స్వీకరించాల్సి ఉంటుంది.
పెండ్లితో సినిమాల్లో జోరు తగ్గించిన సోనమ్ కపూర్ కొడుకు పుట్టాక కెరీర్‌కు కామా పెట్టింది. మళ్లీ మరో ఇన్నింగ్స్‌కు సిద్ధపడుతున్న సోనమ్ పదినెలలుగా తన కొడుకుతో ప్రతిక్షణాన్ని అద్భుతంగా ఆస్వాదించానని చెప్పుకొచ్చింది. ‘ప్రతి మహిళకూ అమ్మతనం బాధ్యతతో కూడిన వరం. మాతృత్వాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని సవాళ్లు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. తను తినే ఆహారం గురించి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, జిహ్వచాపల్యం కొద్దీ ఏదేదో తినేస్తే, తల్లి పాలు తాగే పిల్లాడికి ఏదైనా సమస్య రావచ్చు. అందుకే, అనుక్షణం తను జాగ్రత్తగా ఉంటూ, పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కోవాలి’ అని అమ్మగా తను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించింది సోనమ్. తల్లయిన నటికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయన్న వాదన అర్ధసత్యం అంటున్నదామె. ‘సినిమాల్లో మాత్రమే కాదు, బయట ఏ రంగం తీసుకున్నా మహిళలు సత్తా చాటుతున్నారు. మల్టీ టాస్కింగ్‌లో ఆడవాళ్లు అగ్గిపిడుగులే! ఏకకాలంలో నాలుగైదు పనులు చక్కబెట్ట గలరు. అయితే, గర్భిణిగా నెలలు నిండే క్రమంలో, తల్లయిన కొత్తలో ఆమె వేగం తగ్గవచ్చు. అంతమాత్రానికే స్త్రీ శక్తిసామర్థ్యాలు సన్నగిల్లినట్టు కాదు’ అని ఇండస్ట్రీలో తన పని అయిపోయిందని కామెంట్ చేసినవారికి కౌంటర్ ఇచ్చింది.

Sonamkapoor1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anand Ahuja
- Sonam Kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

