Aamir Khan Task | అమీర్ ఖాన్ ముందు పెద్ద టాస్క్..మరి గెలిచేనా..?
ఆర్ఆర్ఆర్ (RRR), కేజీఎఫ్ 2 (KGF 2). బాలీవుడ్ (Bollywood) సినిమాలను కూడా మరిచిపోయేంతలా సక్సెస్ అందించాయి. కేజీఎఫ్ 2 ఇపుడు హిందీ బెల్ట్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ నిలిచింది.
భారత సినీ పరిశ్రమ (Indian Film Industry) కు మంచి హిట్స్ అందించాయి పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్ (RRR), కేజీఎఫ్ 2 (KGF 2). బాలీవుడ్ (Bollywood) సినిమాలను కూడా మరిచిపోయేంతలా ఈ రెండు సక్సెస్ అందించాయి. కేజీఎఫ్ 2 ఇపుడు హిందీ బెల్ట్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ నిలిచింది. ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టే ఒకే ఒక్క హీరో అమీర్ ఖాన్ అంటూ బీటౌన్‌లో తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ ఛద్దా (Laal Singh Chaddha) సినిమాలో నటిస్తున్నాడు.
గతంలో పీకే, దంగల్ లాంటి చిత్రాలతో బాక్సాపీస్‌ను షేక్ చేశాడు అమీర్ ఖాన్. దక్షిణాది సినిమాల (South Films)పై ఫోకస్ పెరుగుతూ..బాలీవుడ్ సినిమాల క్రేజ్ తగ్గిపోతున్న ఇలాంటి తరుణంలో హిందీ బాక్సాపీస్‌కు మళ్లీ మునుపటి రోజులు తెచ్చే అతి పెద్ద టాస్క్ ఇపుడు అమీర్ ఖాన్ పైనే ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
1994లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన హాలీవుడ్ ప్రాజెక్టు ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా వస్తోంది. లాల్ సింగ్ ఛద్దా చిత్రంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కమర్షియల్ హంగులుండకపోవచ్చని టాక్ నడుస్తుంది. కొంతకాలంగా పరిస్థితులను గమనిస్తే ప్రేక్షకుల డ్రామాలు, కామెడీ ట్రాక్‌లను చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. రొటీన్ సినిమాల ఫార్మాట్‌ను పక్కన పెట్టిన ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు జనాలను రప్పించి..రికార్డులు బద్దలు కొట్టడం అమీర్‌ఖాన్ కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
కేజీఎఫ్ 2 ఓపెనింగ్ డే రికార్డును లాల్ సింగ్ ఛద్దా అధిగమించకపోతే..అది అమీర్ స్టార్డమ్కు భారీ డ్రా బ్యాక్ అవడం గ్యారంటీ అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అమీర్ ఖాన్ తన రేంజ్ ఏంటో చూపించి..హిందీ చిత్రపరిశ్రమకు మునుపటి హంగులు తెస్తాడా..? లేదా అనేది మరికొంత కాలం ఆగితే తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

