Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ‘బీబీ హోటల్’ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంటిని హోటల్‌గా మార్చిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు. రెడ్ జోన్లో ఉన్నవారు హోటల్ సిబ్బందిగా, ఎల్లో జోన్ సభ్యులు యజమానులుగా, గ్రీన్ జోన్‌లోని గోట్ సభ్యులు అతిథులుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ‘బీబీ హోటల్’ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంటిని హోటల్‌గా మార్చిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు. రెడ్ జోన్లో ఉన్నవారు హోటల్ సిబ్బందిగా, ఎల్లో జోన్ సభ్యులు యజమానులుగా, గ్రీన్ జోన్‌లోని గోట్ సభ్యులు అతిథులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతిథులకు అందించే సేవలు, ఆతిథ్యం, వారి నుంచి సంపాదించే డబ్బులు, స్టార్ల ఆధారంగా ఈ టాస్క్ కొనసాగుతోంది. అయితే ఈ ఆటలో టాస్కుల కంటే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, సరదా సన్నివేశాలు, వ్యూహాలు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి.
బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా హోటల్ యజమానులు ఇచ్చే సైగలను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన అంశాలను సిబ్బంది సరైన క్రమంలో బోర్డుపై అమర్చాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో నరేష్, ఝాన్సీ ఒక జట్టుగా, వర్షిణి, రోహిత్ మరో జట్టుగా పాల్గొన్నారు. నరేష్ సైగలను గుర్తించి బోర్డుపై అంశాలను అమర్చాల్సిన ఝాన్సీ పొరపాటు చేసింది. అంతేకాకుండా తాను అమర్చిన బోర్డు సరైనదేనా అని నరేష్‌ను అడగడంతో బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలో ఇచ్చిన సూచనలను అర్థం చేసుకుని సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఇతరులను అడగడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఝాన్సీ క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత సంచాలక్‌గా ఉన్న త్రిగుణ్ ఆటను మళ్లీ ప్రారంభించారు. ఈసారి కూడా కొన్ని అంశాలను తప్పుగా అమర్చడంతో ఒక జట్టు ఫౌల్ గేమ్ ఆడినట్లు త్రిగుణ్ నిర్ణయించారు.. అయితే తాము నిబంధనలకు అనుగుణంగానే ఆడామని వర్షిణి, రోహిత్ వాదించారు. చివరకు రోహిత్, వర్షిణి జట్టు విజయం సాధించింది.
బీబీ హోటల్ టాస్క్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖేష్, దేబ్జానీ జంటగా హోటల్‌కు వచ్చినట్లు టాస్క్‌లో భాగంగా చూపించారు. అయితే ముఖేష్ వర్షిణితో సన్నిహితంగా ఉండటంతో దేబ్జానీ అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వర్షిణికి ముఖేష్ ముద్దు పెడుతున్న ఫొటోను బిగ్‌బాస్ బయటపెట్టడంతో ఇంట్లో చర్చ మొదలైంది. ఆ ఫొటోను చూసిన దేబ్జానీ.. ముఖేష్ తనను మోసం చేశాడా అంటూ ప్రశ్నించింది. దీనికి ముఖేష్ స్పందిస్తూ, వర్షిణి తన మాజీ ప్రేయసి అని, ప్రస్తుతం ఆమె అక్కడ పనిచేస్తోందనే విషయం తనకు తెలియదని చెప్పాడు. ఈ సన్నివేశం ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది.
మరోవైపు, హోటల్ టాస్క్‌లో డబ్బులు, స్టార్ల పంపిణీ కూడా కీలకంగా మారింది. త్రిగుణ్, శివ్, నీతూ, రామ్ ప్రసాద్ కలిసి స్టార్లను ఎలా పంచుకోవాలనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. కొంత డబ్బు తీసుకుని ఒక స్టార్‌ను రామ్ ప్రసాద్‌కు ఇచ్చారు. తన దగ్గర స్టార్ ఉన్నంతవరకే తనకు అధికారం ఉంటుందని త్రిగుణ్ వ్యాఖ్యానించగా, వర్షిణి కూడా తనకు స్టార్ ఇవ్వాలని కోరింది. వర్షిణి తనను భావోద్వేగంగా ఒత్తిడికి గురిచేయవద్దని త్రిగుణ్ చెప్పడంతో వారి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మరోవైపు, నీతూ రామ్ ప్రసాద్‌కు ఉచితంగా స్టార్ ఇచ్చిందని సుధీర్ చెప్పడంతో రోహిత్ ఆమెను ప్రశ్నించింది. రోహిత్ వద్ద రూ.12 వేల నగదు ఉందనే అంశం కూడా చర్చకు వచ్చింది. స్టార్ల పంపిణీ వెనుక ఎవరెవరి వ్యూహాలు ఉన్నాయన్నది టాస్క్‌లో కీలకంగా మారింది.
టాస్కుల్లో విజయం సాధించలేక రెడ్ జోన్లో కొనసాగుతున్న సభ్యులకు బిగ్‌బాస్ హెచ్చరిక ఇచ్చారు. ఛాలెంజ్‌లు పూర్తయ్యే వరకు రెడ్ జోన్లోనే ఉండేవారు రెండు రకాల ఎలిమినేషన్ ప్రక్రియలను ఎదుర్కోవాల్సి రావచ్చని వెల్లడించారు. దీంతో రెడ్ జోన్ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. గత వారం దక్షి ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ కాగా, గోట్ సభ్యుల నిర్ణయంతో షాలిని కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ వారం మరోసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది. బీబీ హోటల్ టాస్క్ ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు, స్టార్లు ఉంటాయో వారికి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే గతంలో విధించిన శిక్ష కారణంగా రోహిత్‌కు కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు పైచేయి సాధిస్తారు? రెడ్ జోన్ సభ్యుల్లో ఎవరికి ఊరట లభిస్తుంది? ఈ వారం ఎలిమినేషన్‌పై బిగ్‌బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది తదుపరి ఎపిసోడ్లలో తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
Balakrishna | బాలకృష్ణ శివ నిర్వాణ దర్శకత్వంలో?
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

