Bigg Boss | బిగ్ బాస్ కొత్త సీజన్‌కి టైం ఫిక్స్.. ప్రోమోతో క్లారిటీ ఇచ్చేసారుగా..!
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకుల అభిమాన షో బిగ్‌బాస్ మరోసారి తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాపులర్ రియాలిటీ షో త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా భాషలకి సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్ విడుదల కాగా, పార్టిసిపెంట్ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకుల అభిమాన షో బిగ్‌బాస్ మరోసారి తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాపులర్ రియాలిటీ షో త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా భాషలకి సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్ విడుదల కాగా, పార్టిసిపెంట్ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 ప్రీమియర్‌కు తేదీ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జియో హాట్‌స్టార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 18 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసిన బిగ్‌బాస్ హిందీ వెర్షన్‌కు మంచి క్రేజ్ ఉంది. 19వ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి కూడా షోను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపిస్తూ, “ఈసారి ఇది హౌస్మేట్స్ ప్రభుత్వం” అంటూ కొత్త థీమ్‌కి హింట్ ఇచ్చారు. ఈ ప్రోమోతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. బిగ్‌బాస్ 19 ఈసారి ఆగస్టు 24న గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభం కానుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఓ పెద్ద ప్రయోగం చేయబోతున్నారు. గత ఏడాది షోని మూడున్నర నెలలు నడిపించగా, ఈసారి మాత్రం మొత్తం ఐదున్నర నెలల పాటు షో సాగనుందని సమాచారం.
వివిధ రంగాల ప్రముఖులు బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో హౌస్మేట్స్ ఎవరవుతారన్న ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ 19 షో జియో హాట్‌స్టార్ లో డిజిటల్‌గా, కలర్స్ ఛానెల్ ద్వారా టీవీలో ప్రసారం కానుంది. ఈ సారి షోలో వచ్చే ట్విస్టులు, టాస్కులు, డ్రామా ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో తెలుగు బిగ్ బాస్ మొదలు కానుంది. ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో సామాన్యులకి కూడా చాన్స్ ఇస్తుండడంతో షోపై ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

