బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

LOBO in Bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు మొదలై చూస్తుండగానే 50 రోజులు అయిపోయింది. 8వ వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగే యాంకర్ రవి నామినేషన్ లిస్ట్ లో ఉన్నాడు. వరుసగా 8వ వారం కూడా ఈయన నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం. ప్రతి వారం నామినేట్ అయిన ఒకే ఒక సభ్యుడు యాంకర్ రవి. అలాగే ప్రతి వారం సేఫ్ అవుతూనే ఉన్నాడు. ఈ వారం కూడా రవి నామినేషన్స్ లో ఉన్నాడు. కానీ కచ్చితంగా సేఫ్ అవుతాడు. ఎందుకంటే బయట ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఈయనతో పాటు ఈ వారం షణ్ముఖ్ జస్వంత్, లోబో, సిరి హనుమంతు, శ్రీ రామచంద్ర, మానస్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూస్తే రవి, షణ్ముఖ్ జస్వంత్ అందరికంటే ముందున్నారు. ఇద్దరికీ భారీగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత శ్రీ రామచంద్ర, మానస్ కూడా ముందున్నారు. ఈ నలుగురు కచ్చితంగా ఈ వారం సేఫ్ జోన్ లో ఉండడం ఖాయం.

ఎటొచ్చి డేంజర్ జోన్ లో ఉన్నది సిరి ఇంకా లోబో. సిరి, లోబో ఇద్దరిలో ప్రత్యేకంగా డేంజర్ జోన్లో ఎక్కువగా ఉన్నది మాత్రం లోబో. ఎందుకంటే గత ఏడు వారాల్లో ఏకంగా ఆరుగురు అమ్మాయిలు ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయారు. దాంతో బిగ్ బాస్ కేవలం అబ్బాయిల కోసం పెట్టారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు అబ్బాయిల్లో కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మొదటి వారం సరయు.. రెండోవారం ఉమాదేవి.. మూడోవారం లహరి.. 4 వారం నటరాజ్ మాస్టర్.. ఐదో వారం హమీద.. ఆరో వారం శ్వేత వర్మ.. 7వ వారం ప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా అమ్మాయి ఎలిమినేట్ అయితే ఈ రియాలిటీ షో పై విమర్శలు మరిన్ని పెరగడం ఖాయం. అందుకే ఈ వారం అబ్బాయి ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న వాళ్లలో లోబో మాత్రమే వీక్ కంటెస్టెంట్. సిరి కూడా ఉన్నంతలో బెస్ట్ ఇస్తుంది. అందుకే ఇప్పట్లో ఈమె ఎలిమినేట్ కావడం కష్టమే. ఎలా చూసుకున్నా కూడా ఈ వారం లోబో డేంజర్ జోన్ లో కొనసాగుతున్నాడు. పరిస్థితులు కూడా ఆయనకు ప్రతికూలంగానే ఉన్నాయి. సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కన్ఫెషన్ రూమ్ లో ఇంటి సభ్యుల గురించి మాట్లాడి అందరి దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు లోబో. అప్పటి నుంచి ఇంట్లో టాస్క్ లు కూడా సరిగా ఆడటం లేదు. మొత్తానికి 8 వారాల జర్నీ తర్వాత లోబో బిగ్ బాస్ ఇంటిని వదిలి పెట్టేలా కనిపిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
LOBO : లోబో చేసిన పనికి బిత్తరపోయిన హౌజ్‌మేట్స్..!
Bigg boss 5 telugu : పేడలో పడి దొర్లిన లోబో,షణ్ముఖ్..!
Priyanka : నీ మొహం పగిలిపోద్ది అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక…!
samantha | సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

