Siri Hanmanth elimination | సాధారణంగా బిగ్ బాస్ హౌస్కు వెళ్లిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాలి అంటే కేవలం ప్రేక్షకులు చేతుల్లోనే ఉంటుంది. అది సృష్టించిన నిర్వాహకుల చేతుల్లో కూడా ఉండదు అని ఇప్పటికే హోస్ట్ నాగార్జున చాలా సార్లు చెప్పాడు. అలా కాకుండా హౌస్మేట్స్ కొన్నిసార్లు ఇంటి నుంచి కొంతమంది కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తుంటారు.. అలా చేసినా కూడా అది కేవలం ఫేక్ ఎలిమినేషన్ మాత్రమే. ఇప్పటికే ఐదు సీజన్స్ లో ఇలాంటి సన్నివేశాలు బిగ్బాస్లో చాలా సార్లు కనిపించాయి. ఇన్ని చూసిన తర్వాత కూడా తాజాగా మరోసారి బిగ్ బాస్ గేమ్ ప్లే చేశాడు.
ప్రోమోలోనే సిరి బయటికి వెళ్తున్నట్లు చూపించాడు. కేవలం ఇంకో మూడు రోజుల్లో సీజన్ ముగుస్తుంది. అందులోనూ టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ ను అలా సడన్గా ఎలిమినేట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యులందరినీ తమ సూట్కేసు పట్టుకుని గార్డెన్ ఏరియాకు రమ్మంటాడు బిగ్ బాస్. వచ్చిన తర్వాత ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు మీరు చెప్పండి అంటూ ప్రతి ఒక్క ఇంటి సభ్యుడిని అడిగాడు. అప్పుడు సన్నీ, మానస్ ఇద్దరు షణ్ముఖ్ పేరు చెప్పారు. శ్రీ రామచంద్ర మాత్రం సిరి పేరు తీసుకొచ్చాడు.
ఆ తర్వాత వెంటనే ఇంటినుంచి సిరి ఎలిమినేట్ అయినట్లు బిగ్బాస్ అనౌన్స్ చేశాడు. నేను వెళ్లను బిగ్ బాస్ అంటూ అక్కడే కూర్చుంది సిరి. ఆ తర్వాత డోర్స్ ఓపెన్ కావడంతో బయటికి వెళ్లిపోయింది. కానీ ఇది నిజమైన ఎలిమినేషన్ కాదు.. ఒక గంట సేపు ఆమెను సీక్రెట్ రూమ్లో ఉంచి ఆ తర్వాత మళ్లీ ఇంటిలోకి పంపించాలని బిగ్బాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదంతా ఎపిసోడ్ ప్రసారమవుతున్నప్పుడు బయటకి వస్తోంది. చివరి మూడు రోజుల్లో కూడా ఇలాంటి గేమ్స్ అవసరమా బిగ్బాస్ మీకు.. అంటూ సోషల్ మీడియాలో ఈ ప్రోమోపై కామెంట్స్ వస్తున్నాయి. మతానికి సిరి ఎలిమినేషన్ డ్రామా వెనుక ఇంత కథ ఉంది అన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Siri: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన సిరి.. సన్నీపై ఫైర్
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్పైకి ఎక్కబోయిన ఆ ముగ్గురు.. వార్నింగ్తో పాటు శిక్షలు జారీ
Shanmukh: సిరి ఒళ్లో తల పెట్టి పాత సంగతులు గుర్తు చేసిన షణ్ముఖ్
Keerthy Suresh relaxing time | కీర్తిసురేశ్ ఎక్కడ రిలాక్స్ అవుతుందో చూడండి