బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో సిరి-షణ్ముఖ్ వ్యవహారం ఎవరికి అర్ధం కావడం లేదు. ఫ్రెండ్స్ అంటారు, కాని అంతకన్నా ఎక్కువ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. సిరి అయితే షణ్ముఖ్‌ని లవ్ చేస్తున్నట్టుగా యాంకర్ రవితో చెప్పిందనన్న విషయాన్ని అతను పబ్లిక్‌గానే చెప్పాడు. హగ్స్ విషయంలో తల్లి హెచ్చరించినా కూడా వారు తగ్గడం లేదు. 103వ ఎపిసోడ్లో సోఫాలో సిరి-షణ్ముఖ్‌లు కూర్చుని ఉండగా.. షణ్ముఖ్ బిగ్ బాస్‌ని ఇమినేట్ చేస్తూ సిరి ఉద్దేశించి.. ‘బిగ్ బాస్ కోరికమేరకు సిరి.. పెళ్లం ఇచ్చినట్టు అడక్కుండానే కాఫీ ఇవ్వకండి’ అని అన్నాడు.
పెళ్లం అని అనగానే సిరి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.. ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా?? పొద్దు పొద్దున్నే ఏమైంది మీకు అని అడిగింది. దీంతో షణ్ముఖ్.. ఏంటి సిరీ.. నా ఫొటోలు పెట్టావ్.. ఊ ఊ పడిపోయావ్ అని అన్నాడు. ఏంటి నీకు పడిపోయానా? అని సిరి అడిగితే.. ‘మరి ఫొటోలు ఎందుకు పెట్టావ్’ అని షణ్ముఖ్ అడిగాడు. ‘నా ఇష్టం రా.. మన ఇద్దరి ఫొటోలు పెట్టాను.. అమ్మ ఫొటో పెట్టా… నీ ఫొటో పెట్టా’ అని అన్నది. నా ఫొటో ఎందుకు పెట్టావ్ బే అని షణ్ముఖ్ వాయిస్ రేస్ చేసి అనడంతో.. ‘ఏంటి నా మీద అరుస్తున్నావ్’ అని సిరి అంటే.. ‘నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అరుస్తా సిరీ’ అని అన్నాడు షణ్ముఖ్.
నువ్వ కాకపోతే నాకు ఎవరున్నారు సిరి అంటూ ఆమె ఒళ్లో వాలిపోయాడు షణ్ముఖ్. బిగ్ బాస్ నేను ఏదైనా సహిస్తాను కానీ.. సిరిని స్టార్టింగ్ నుంచి మోటివేట్ చేసి గేమ్‌లో హెల్ప్ చేశా.. అలాంటి నన్ను వదిలేసి.. సిరికి టైటిల్ ఇస్తే నేను చాలా బాధపడతా బిగ్ బాస్ అని కెమెరా వైపు చూస్తూ చెప్పాడు షణ్ముఖ్.వెంటనే సిరి.. నువ్వు సహించలేవేమో కాని, నేను మాత్రం నీకే రావాలని కోరుకుంటాను అని అంది. వెంటనే షణ్ముఖ్ ..మాటలు అంటా కానీ.. నీకు టైటిల్ వస్తే నాకు చాలా హ్యాపీ అని అన్నాడు.