బిగ్ బాస్ హౌజ్‌లో గురువారం పలు టాస్క్ లు ఇచ్చి ఇంటి సభ్యులని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేసి, వాటి గురించి రాయాలని చెప్పాడు. బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలుపొందాడు.
ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు. అయితే ఓటమి అనే మాట సిరికి నచ్చకపోవడంతో సన్నీపై ఫైర్ అయింది.
షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నేను జోక్‌గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని తేల్చి చెప్పింది. మజాక్‌గా అన్నానని సన్నీ ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది.