Bigg boss 5 telugu | ఇంట్లో అందరినీ ఇరిటేట్ చేయడమే ఆమె స్ట్రాటజీ..

RJ kajal bigg boss 5 telugu season | బిగ్‌బాస్ ఇంట్లో రాముడు మంచి బాలుడిలా ఉంటే ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఫోకస్ కావాలంటే కచ్చితంగా రచ్చ చేయాల్సిందే. అలాంటి కంటెస్టెంట్లే బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ కాలం ఉంటారు. ఇందులో ఆరితేరిపోయింది ఆర్జే కాజల్. ఇంట్లో పరిస్థితులు పూర్తిగా విని అర్థం చేసుకుని.. ఎప్పుడు ఎలాంటి రచ్చ చేస్తే తాను హైలైట్ అవుతాననే విషయాన్ని బాగా బుర్రలో పెట్టుకుంది ఆర్జే కాజల్. అందుకే అవసరమైన ప్రతిసారి ఇంట్లో అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది ఈమె. తనకు స్నేహితులు ఎవరూ లేరని.. తనకు నచ్చినట్లుగా ఉన్నవాళ్లు మాత్రమే తన స్నేహితులు అంటూ తనకు మాత్రమే అర్థమైన భాషలో మాట్లాడుతుంది. ఈమెను నామినేషన్స్ సమయంలో ఎవరూ పెద్దగా టార్గెట్ చేయలేదు. అందుకే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

కానీ వీక్ మధ్యలో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సభ్యులు పూర్తిగా వాడుకున్నారు. నామినేషన్స్ కంటే దారుణంగా వరస్ట్ పర్ఫార్మర్ కాజల్‌కు ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న చాలా మంది కాజల్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. దానికి ఆమె చేస్తున్న పనులే కారణం. గేమ్ కంటే ఎక్కువగా ఇతర వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. వాళ్ల పర్సనల్స్ కూడా బయటకు తీస్తూ.. మిగిలిన వాళ్ల దృష్టిలో విలన్ అవుతుంది కాజల్. అయితే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఎప్పుడూ కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది కాజల్ ప్లాన్. ఇప్పటి వరకు ఐదు వారాల్లో దీన్ని చాలా వరకూ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది. తను నామినేషన్స్ లో ఉన్నా కూడా ఇలా సేఫ్ అవ్వాలి అనేది తనకు బాగా తెలుసు.
ఇంతకు ముందు సీజన్స్ చూసి చూసి బాగా అలవాటు చేసుకుని.. గేమ్‌ను కాచి వడపోసుకొని తాగేసి వచ్చింది ఈమె. కాకపోతే అవసరం ఉన్నా లేకపోయినా అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇంటి సభ్యులను బాగా ఇరిటేట్ చేస్తోంది ఆర్జే కాజల్. అదేంటని అడిగితే నేనింతే అంటూ విచిత్రమైన సమాధానం చెబుతుంది. నాకు నచ్చిన వాళ్లు మాత్రమే స్నేహితులవుతారు.. నచ్చని వాళ్లు నాకు అవసరం లేదు అంటూ మొండి సమాధానం చెబుతుంది. మరి ఈ ఆట తీరుతో ఆర్జే కాజల్ ఎంత వరకు వెళుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Kajal : కాజల్‌పై కోపం..తన ముఖంపై నీళ్లు కొట్టుకొని కోపం చల్లార్చుకున్న అనీ మాస్టర్
Priya : కొత్త కెప్టెన్‌గా ప్రియ.. కాజల్ మనసు కరగదని రవి కామెంట్
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
Manchu vishnu | విమానంలో వచ్చి మరి ఓటు వేసి వెళ్తారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

