Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో 45వ రోజు ఎపిసోడ్ భారీ ట్విస్ట్‌తో సాగింది. ఎలిమినేట్ అయిందని అందరినీ నమ్మించిన షాలిని అసలు హౌస్‌ను వదల్లేదని బిగ్‌బాస్ రివీల్ చేశారు. ఆమెను సీక్రెట్ రూమ్‌లో ఉంచిన తర్వాత బుధవారం ఒక్కసారిగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంతా షాక్‌కు గురయ్యారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో 45వ రోజు ఎపిసోడ్ భారీ ట్విస్ట్‌తో సాగింది. ఎలిమినేట్ అయిందని అందరినీ నమ్మించిన షాలిని అసలు హౌస్‌ను వదల్లేదని బిగ్‌బాస్ రివీల్ చేశారు. ఆమెను సీక్రెట్ రూమ్‌లో ఉంచిన తర్వాత బుధవారం ఒక్కసారిగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంతా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా రోహిత్ ఆమెను హగ్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది. రీఎంట్రీ ఇచ్చిన వెంటనే షాలిని తనదైన స్టైల్లో గేమ్ మొదలుపెట్టింది. టాస్క్ సందర్భంగా దక్షిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదాలు మాట్లాడబోయి చివరి క్షణంలో కంట్రోల్ చేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఇతర సభ్యులు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. దీంతో హౌస్‌లో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన గేమ్‌ను ప్రకటించారు. కంటెస్టెంట్ల ఆటతీరు, ప్రేక్షకుల ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకుని వారిని రెడ్, ఎల్లో, గ్రీన్ అనే మూడు లెవల్స్‌గా విభజించారు. ఇందులో రెడ్ లెవల్లో ఉన్నవారు డేంజర్ జోన్లో ఉన్నట్లుగా బిగ్‌బాస్ ప్రకటించారు.రెడ్ లెవల్ కంటెస్టెంట్స్‌లో ఝాన్సీ, రామ్ ప్రసాద్, రోహిత్, శ్వేత, సుధీర్, ఆర్కే, షాలిని, వంశీ ఉన్నారు. ఎల్లో లెవల్ కంటెస్టెంట్స్‌లో త్రిగున్, నరేష్, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, అమన్, శివ కుమార్ ఉన్నారు. అయితే గ్రీన్ లెవల్‌కు చేరిన వారికి ప్రత్యేక బెనిఫిట్స్ ఉంటాయని బిగ్‌బాస్ ప్రకటించగా, ఎల్లోలో ఉన్నవారు గ్రీన్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లు తెలిపారు.
ఇక రెడ్ లెవల్ సభ్యులకు ఎల్లోలోకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బిగ్‌బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. సర్కిల్ మధ్యలో ఉంచిన బోన్‌ను బజర్ మోగగానే దక్కించుకున్నవారికి బాక్సులు పగలగొట్టే అవకాశం లభించింది. ఆ బాక్సుల నుంచి ఎల్లో కలర్ వస్తే బిగ్‌బాస్ చెప్పిన నిబంధనల ప్రకారం గేమ్‌లోని ఇతర సభ్యులను తొలగించే అవకాశం కూడా ఉండేది. ఈ టాస్క్‌లో సుధీర్, ఝాన్సీ, శ్వేత, రామ్ ప్రసాద్ గాయాలయ్యేంతగా తీవ్రంగా పోరాడారు. చివరికి రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్య జరిగిన ఫైనల్ రౌండ్లో రామ్ ప్రసాద్ పైచేయి సాధించి విజేతగా నిలిచాడు.
ఫైనల్ రౌండ్ గెలిచిన రామ్ ప్రసాద్ రెడ్ లెవల్ నుంచి ఎల్లో లెవల్‌కు ప్రమోట్ అయ్యాడు. దీంతో మిగిలిన రెడ్ లెవల్ సభ్యులపై ఒత్తిడి మరింత పెరిగింది. షాలిని రీఎంట్రీ, దక్షితో ఘర్షణ, కొత్త లెవల్ సిస్టమ్, హోరాహోరీ టాస్క్‌తో 45వ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించింది. వచ్చే ఎపిసోడ్లలో ఈ లెవల్ గేమ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఆసక్తిగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

