Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో 9వ వారం నామినేషన్ల రచ్చ.. ముఖేష్, వర్షిణి టార్గెట్‌గా హౌస్మేట్స్ కౌంటర్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రోహిత్‌ను ఇంటి నుంచి బయటకు పంపడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడి ఎలిమినేషన్ అన్యాయమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రోహిత్‌ను ఇంటి నుంచి బయటకు పంపడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడి ఎలిమినేషన్ అన్యాయమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల మధ్య తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ మరోసారి వేడెక్కింది. సోమవారం జరిగిన నామినేషన్లలో ప్రధానంగా ముఖేష్, వర్షిణి లక్ష్యంగా హౌస్మేట్స్ తమ విమర్శలు ఎక్కుపెట్టారు. గత వారం జరిగిన సంఘటనలు, హౌస్‌లోని వ్యక్తిగత విభేదాలు ఈసారి నామినేషన్లలో ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా వంశీ, ముఖేష్ మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది.
వంశీ నామినేషన్లో ముఖేష్‌ను ఎంచుకుంటూ గత వారం జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు. ‘బీ’, ‘పీ’ అనే పదాలతో జరిగిన గొడవను గుర్తుచేస్తూ.. ముఖేష్ మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని చెప్పాడు. ఆయన ప్రవర్తన వల్ల ఝాన్సీ కూడా ఇబ్బంది పడిందని, ఆమె ఏడవడానికి ముఖేష్ కారణమయ్యాడని ఆరోపించాడు. అదే సమయంలో వర్షిణిని కూడా వంశీ నామినేట్ చేశాడు. తనకు నచ్చని వ్యక్తులను ఆమె నామినేట్ చేయడం లేదని విమర్శించాడు. ఈ క్రమంలో ముఖేష్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో వంశీ ఘాటుగా స్పందించాడు. మీతో మాట్లాడుతుంటే ఆయన ఎందుకు మధ్యలోకి వస్తున్నారు? మీలో ఒకరిని నామినేట్ చేస్తే ఇద్దరూ వస్తారా? అంటూ ప్రశ్నించాడు. దీంతో వంశీ, ముఖేష్ మధ్య వాగ్వాదం మరింత పెరిగింది.
వర్షిణి వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి కూడా వంశీ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. మరోవైపు త్రిగుణ్ కూడా ఈ వివాదంలో స్పందిస్తూ ‘బీ’ అంటే బ్రోకర్, ‘పీ’ అంటే పప్పెట్ అంటూ శివతో సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ నామినేషన్లలో సుధీర్, వంశీ మధ్య కూడా వాదన జరిగింది. వంశీ కోపాన్ని చూసి తాను భయపడుతున్నానని సుధీర్ వ్యాఖ్యానించగా.. తనపైకి వస్తే తన కోపం అలాగే ఉంటుందని వంశీ సమాధానమిచ్చాడు. హౌస్‌లో ఇన్ని కెమెరాలు ఉన్నా ఎంతకాలం నటిస్తామని సుధీర్ ప్రశ్నించగా, అది నీ నటనపై ఆధారపడి ఉంటుందని వంశీ కౌంటర్ ఇచ్చాడు.
మరోవైపు సుధీర్, అమన్‌ను నామినేట్ చేస్తూ.. తనను హౌస్ నుంచి బయటకు పంపించే విషయంలో అమన్ తీసుకున్న నిర్ణయం స్నేహం పరంగా తనకు నచ్చలేదని చెప్పాడు. దీనికి అమన్ స్పందిస్తూ.. రెండు చప్పట్లు కొడితేనే స్నేహం అవుతుందా? అన్నట్టుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శ్వేత నాయుడు కూడా ముఖేష్‌ను నామినేట్ చేస్తూ ఆయన ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరూ అడ్డుకోకపోయినా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో ముఖేష్ తన ఆట గురించి మాట్లాడగా, శివ కుమార్ తీవ్రంగా స్పందించాడు.నీ ఆట వల్లే ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది’ అంటూ ముఖేష్‌కు శివ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న సభ్యులంతా ఒక్కసారిగా స్పందించారు. ముఖేష్ తన ఆట తాను ఆడుతున్నానని చెప్పడంతో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
మరోవైపు నీతూ, వర్షిణిని నామినేట్ చేస్తూ గ్రీన్ లెవల్లోకి రావడానికి అక్కాతమ్ముడి అనుబంధం కారణమని వ్యాఖ్యానించింది. దీనికి వర్షిణి స్పందిస్తూ.. అలా చేయొద్దని చెప్పే అవకాశం మీకూ ఉందని తెలిపింది. అయితే కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని గత వారాంతంలో హోస్ట్ నాగార్జున చెప్పిన విషయాన్ని దేబ్జానీ గుర్తుచేయడంతో వర్షిణి ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. ఇక తొమ్మిదో వారం నామినేషన్లలో ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ, రామకృష్ణ, శివ కుమార్, వంశీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జాబితాపై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ఈ వారం నామినేషన్లు వ్యక్తిగత విభేదాలు, పాత గొడవలతో హౌస్‌లో వేడిని పెంచాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | చార్జీలు ఎక్కువుంటే విమానంలో వెళ్లొద్దు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో 9వ వారం నామినేషన్ల రచ్చ.. ముఖేష్, వర్షిణి టార్గెట్‌గా హౌస్మేట్స్ కౌంటర్!
Congress | ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బూతుల రచ్చ.. హోటల్ లాబీలో మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తిట్ల దండకం
US Midterm Elections | ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష.. యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

