Bichagadu 3 | క్రేజీ టాక్.. బిచ్చగాడు 3లో బ్రదర్ సెంటిమెంట్..!
Bichagadu 3 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన బిచ్చగాడు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్టు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే ప్రాంచైజీలో బిచ్చగాడు 2 (Bichagadu 2) కూడా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
Bichagadu 3 | విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన బిచ్చగాడు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్టు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం విజయ్ ఆంటోనీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా.. ఇండియావైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చింది. ఇటీవలే ఇదే ప్రాంచైజీలో బిచ్చగాడు 2 (Bichagadu 2) కూడా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ.
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌లో కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. కాగా బిచ్చగాడు అమ్మ సెంటిమెంట్‌తో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక సీక్వెల్ అన్నాచెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చి మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే త్వరలో బిచ్చగాడు 3 కూడా రాబోతుందని తెలిసిందే. థర్డ్ ఇన్స్టాల్మెంట్ త్వరలోనే షురూ కానుందని చెప్పాడు విజయ్ ఆంటోనీ. కాగా బిచ్చగాడు 3లో బ్రదర్స్ సెంటిమెంట్ పెట్టబోతున్నాడని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇదే నిజమైతే ఈ సారి ఎలాంటి స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. బిచ్చగాడు 2 చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతమందించాడు. ఈ చిత్రంలో హరీష్ పేరడి, దేవ్ గిల్, జాన్ విజయ్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. హోం బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

