Bhumika Chawla | భూమిక చావ్లా తన తొలి సంపాదన ఏం చేసిందో తెలుసా.?
Bhumika Chawla | అమ్మాయే సన్నగా....అరనవ్వే నవ్వగా అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార భూమిక చావ్లా. ఈమె నటించిన తొలి చిత్రం యువకుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఆ తరువాత భూమిక నటించిన రెండవ చిత్రం ఖుషీ.
Bhumika Chawla | అమ్మాయే సన్నగా….అరనవ్వే నవ్వగా అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార భూమిక చావ్లా. ఈమె నటించిన తొలి చిత్రం యువకుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఆ తరువాత భూమిక నటించిన రెండవ చిత్రం ఖుషీ.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న భూమిక ఆ తరువాత మహేష్‌బాబు హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒక్కడులో నటించిన సంగతి తెలిసిందే. దీని తరువాత అదే ఏడాది వచ్చిన సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుంది. అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవితో జైచిరంజీవ సినిమాలో జతకట్టింది. ఇక ఆమెకున్న పాపులారిటీ దృష్ట్యా సత్యభామ, అనసూయ వంటి లేడ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
కొద్ది కాలానికి యోగా గురువైన భరత్ ఠాగూర్ ని వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె సినిమాలలో పెద్దగా నటించడం లేదు. నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆడపా దడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్న భూమిక పలు భాషల్లో కూడా నటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిత్రాల్లో ప్రాధాన్యత వున్న పాత్రలు పోషిస్తోంది.
అయితే నటిగా ఎంట్రీకి ముందు భూమిక చదువు పూర్తయిన తరువాత ఏం చేసింది? ఆమె నటి కాక ముందు ఏంచేశారు అనే ఆసక్తి అందరిలోనూ వుంటుంది. అయితే భూమిక చావ్లా గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమె తొలి సంపాదన ఏం చేసిందో ఇలా చెప్పుకొచ్చారు……..ఒక కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీలో కొద్ది రోజులు పని చేశాను. అప్పుడు నా ఫస్ట్ సాలరీ రెండు వేలు వచ్చేది. ఆ జీతం అంతా అమ్మకు ఇచ్చేసా. నా రెండో నెల జీతంతో నాన్నకు ఒక షర్ట్ కొన్నాను, అక్కకు బాంగిల్స్ కొనిచ్చాను. నా మూడో నెల సాలరీతో మా అన్నయ్యకు షర్ట్ కొన్నాను. అలా ప్రతి నెలా ఇంట్లో వాళ్ళకు ఏదో ఒక వస్తువు కొని ఇవ్వటం నాకు అలవాటు అని భూమిక చావ్లా చెప్పుకొచ్చారు. రెండు వేల రూపాయల సాలరీతో కెరీర్‌ను మొదలుపెట్టిన భూమిక కోటి రూపాయాలు పారితోషికం అందుకునే హీరోయిన్గా ఎదగడం అభినందనీయం. ప్రస్తుతం భూమిక హోటల్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యింది. సమరా వెల్నెస్ హోటల్ అనే పేరుతో రెస్టారెంట్ నడుపుతుంది.
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

