Bhola Shankar Movie | వామ్మో భోళా శంకర్ ఓటీటీ హక్కులు అన్ని కోట్లా?
Bhola Shankar Movie on Ott | చిరు అభిమానులను కలలో కూడా ఉలిక్కి పడేలా చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. అసలు ఫ్లాప్ అన్న పదమే ఎరుగని కొరటాల శివకు కెరీర్లో ఓ మచ్చగా మిగిలింది.
Bhola Shankar Movie on Ott | చిరు అభిమానులను కలలో కూడా ఉలిక్కి పడేలా చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. అసలు ఫ్లాప్ అన్న పదమే ఎరుగని కొరటాల శివకు కెరీర్లో ఓ మచ్చగా మిగిలింది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆచార్య నష్టాలు పూడ్చడానికి ఆస్తులు తాకట్టుపెట్టాల్సి వచ్చింది. ఇక మెగా అభిమానులు దీన్నొక పీడకలలా.. మళ్లీ అలాంటి సినిమా చిరు నుంచి రాదులే అనుకున్నారు. కాన్నీ దానికి మించిన డిజాస్టర్ ఫలితాన్ని భోళాశంకర్ అందుకుంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది. చిరు కెరీర్లో తొలిసారి జీరో షేర్ అనే మాట వినాల్సి వచ్చింది.
నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. చిరు ఫ్యాన్స్ సైతం ఇది కూడా పోతుందని ముందుగానే ఫిక్సయిపోయారు. అయితే కథలో మాస్ హంగులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఓ మోస్తరు విజయమైనా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. దాంతో మరో వారం, పది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చే చాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.30 కోట్ల డీల్ కుదరించుకుందట. అయితే ఇదంతా జరిగింది రిలీజ్‌కు ముందు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌కు బాగా కలిసొచ్చింది. థియేటర్లో చాలా మంది చూసినప్పటికీ.. ఓటీటీలోనూ వీర లెవల్లో ఆదరణ దక్కింది. దాంతో భోళాను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. అయితే భోళా సినిమాను థియేటర్లో చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. అసలు సినిమాకు ఆ రేంజ్ నెగెటివీటీ రావడానికి అంతలా ఏముందని సినీ లవర్స్ ఓ షో వేసిన.. నెట్‌ఫ్లిక్స్‌కు బాగానే కలిసొస్తుంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. చిరుకు జోడీగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి రోల్ చేసింది. సుశాంత్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

