Bharateeyudu 2 | 20 అన్నారు 12కి ఫిక్స్ అయ్యారు.. ‘భారతీయుడు 2’ రన్‌టైం తగ్గించిన మేకర్స్.!
Bharateeyudu 2 | కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
Bharateeyudu 2 | కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడు కంటే తెలంగాణలో టికెట్ రేట్ ఎక్కువ ఉండడం ఈ సినిమాకు మరింత మైనస్ అయ్యింది. దీంతో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకుల ఎవరు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఈ సినిమా రన్‌టైం విషయం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా మూడు గంటల రన్‌టైం ఉండగా.. అంతసేపు ప్రేక్షకులు చూడలేకపోతున్నారని అందుకే మువీని 20 నిమిషాలు ట్రిమ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. చిత్రబృందం అధికారికంగా మూవీని ట్రిమ్ చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమాను 20 నిమిషాలు కాకుండా 12 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దగ్గరలో ఉన్న థియేటర్లలో ట్రిమ్ చేసిన వెర్షన్‌ను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేసింది. ఇక ట్రిమ్ చేసిన అనంతరం మూవీపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, బాబీ సింహ, సముద్రఖని, వివేక్, కాళిదాస్ జయరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్)కు సామాజిక స్పృహ ఎక్కువ. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి ఘటనలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తుంటాడు. ఉద్యోగం కోసం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతన్ని కలవరపరుస్తుంది. అందుకు కారకులైన వారిని శిక్షించాలంటూ అరవిందన్ చేసే పోరాటం ఫలించదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అతను ‘భారతీయుడు’ మళ్లీ రావాలంటూ సోషల్‌మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో తైవాన్ రాజధాని తైపీలో ఉంటున్న భారతీయుడు (కమల్‌హాసన్) ఇండియాకు తిరిగొస్తాడు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న కొందరు బడా బాబులను అంతమొందిస్తాడు. అదే క్రమంలో అవినీతికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం నింపుతూ రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. ఈ నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్న అరవిందన్ తండ్రి (సముద్రఖని) సైతం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అవుతాడు. దీంతో మనస్తాపానికి గురైన అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. తన కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణం సేనాపతియేనని అరవిందన్ అతనిపై కోపం పెంచుకుంటాడు. ఇండియన్ గోబ్యాక్ అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అవినీతిని అంతమొందిస్తానని తిరిగొచ్చిన సేనాపతిపై సామాన్య ప్రజలు కూడా తిరగబడటానికి కారణాలేమిటి? భారతీయుడి అసలు లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది.
Also read..
Meiyazhagan Movie | ఎన్టీఆర్ ‘దేవర’కు పోటిగా వస్తున్న కార్తీ ‘మెయ్యళగన్’
Polimera 3 | పొలిమేర -3 నిర్మాతపై పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

