Bhale Unnade | విడుదల తేదీ ప్రకటించిన రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే!’
Bhale Unnade | టాలీవుడ్ యువ కథానాయకుడు ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘నా సామి రంగా’, ‘పురుషోత్తముడు’, తిరగబడరసామి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
Bhale Unnade | టాలీవుడ్ యువ కథానాయకుడు ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘నా సామి రంగా’, ‘పురుషోత్తముడు’, తిరగబడరసామి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. రాజ్‌తరుణ్ కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మారుతి టీమ్ ప్రొడక్ట్ సంస్థ సమర్పిస్తోంది. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మాత.
ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను మొదట వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 07న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆరోజు విజయ్ గోట్ విడుదల కానుడటంతో విడుదల తేదీని వాయిదా వేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘పురుషోత్తముడు’, తిరగబడరాసామి వచ్చి రెండు నెలలు కూడా అవ్వట్లేదు అంతలోనే మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు రాజ్ తరుణ్. ఇక ఈ సినిమాతోనైనా రాజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ టైలర్ పాత్రలో నటిస్తుండగా.. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read..
- 35 Chinna Katha Kaadu | మొట్టికాయలేస్తెనే మోటివేషన్ వస్తుందిరా.. నివేదా థామస్ 35 చిన్న కథ కాదు ట్రైలర్
- NBK 50 Years Celebrations | అతిరథ మహారథులంతా ఒక్కచోట.. బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వచ్చేది వీళ్లే.!
- Heavy Rains | తెలంగాణలో ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

