ఫైనల్ కట్ చూశాను.. అదిరిపోయింది
‘ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఒక మంచి సినిమాలో నటించామనే తృప్తి మా అందరిలో ఉంది. ఇష్టంతో కష్టపడి ఈ సినిమా చేశాం. దర్శకుడు విజయ్ కనకమేడల హార్డ్‌వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రీసెంట్గా ఫైనల్ కట్ చూశాను. అదిరిపోయింది. మే 30 మనందరికీ పెద్ద పండుగ. సక్సెస్‌మీట్‌లో కలుద్దాం.’
‘ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఒక మంచి సినిమాలో నటించామనే తృప్తి మా అందరిలో ఉంది. ఇష్టంతో కష్టపడి ఈ సినిమా చేశాం. దర్శకుడు విజయ్ కనకమేడల హార్డ్‌వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రీసెంట్గా ఫైనల్ కట్ చూశాను. అదిరిపోయింది. మే 30 మనందరికీ పెద్ద పండుగ. సక్సెస్‌మీట్‌లో కలుద్దాం.’ అని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అన్నారు. ఆయన, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడారు. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్, అగ్ర దర్శకులు సంపత్‌నంది, అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
‘ఈ సినిమా వల్ల సాయితో, రోహిత్‌తో నా బంధం బలపడింది. అలాగే ఆనంది, అదితిలతో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. మేం సక్సెస్‌లో ఉన్నామా? సినిమాలు చేస్తున్నామా? ఈవేమీ చూడకుండా కేవలం మాపై నమ్మకంతో కె.కె.రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు. విజయ్ కనకమేడల డెడికేషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా విజయం కోసం మేమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. సినిమా బాగా వచ్చింది. ఆదరిస్తారని నా నమ్మకం’ అని మంచు మనోజ్ చెప్పారు. ఈ సినిమాతో దర్శకుడు విజయ్ కనకమేడల కచ్చితంగా కమర్షియల్ డైరెక్టర్ స్థాయికి ఎదుగుతాడని, ఈ సినిమా పెద్ద విజయం సాధించి, నిర్మాత రాధామోహన్‌కి లాభాలు తెచ్చిపెట్టాలని, తనకు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకం ఈ సినిమా అని నారా రోహిత్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

