Bhadrakali | ఆసక్తి రేపుతున్న భద్రకాళి ట్రైలర్.. ఆకట్టుకుంటున్న సంభాషణలు
Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమాతో అలరించిన విజయ్ ఆంటోని చివరిగా మార్గన్ చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు.
Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమాతో అలరించిన విజయ్ ఆంటోని చివరిగా మార్గన్ చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో దర్శకుడు అర్జున్ తెరకెక్కిస్తుండగా, తరతరాల పౌరుషం..తెగింపునకి వెనకాడదు అంటూ ఎన్నికలు, డబ్బు చుట్టూ పలు సంభాషణలు ఆసక్తిరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతుంది.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VB G Ram G Scheme | సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి.. ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్తో 3.73 లక్షల మంది కూలీలు మాయం
Government Lands | సర్కార్‌కు భూములే దిక్కా.. ఆస్తులు అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయమా?
చివరి చూపునకు వెళ్లినా నిర్బంధమేనా? బీఆర్ఎస్ నేత మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!
Volunteer Jobs | నిరుద్యోగులకు మరో ధోకా.. లక్ష మంది వలంటీర్ల నియామకానికి రేవంత్ సర్కార్ ప్లాన్!
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

