విజయ్ ఆంటోని కథానాయకుడిగా అరుణ్‌ప్రభు దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘భద్రకాళి’. సర్వంత్రామ్ క్రియేషన్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తాత తన మనవడికి జీవిత పాఠాలు బోధిస్తుండటంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కథ వెయ్యికోట్ల రాజకీయ స్కామ్‌లోకి వెళుతుంది.
ఆ కుంభకోణం వెనక ఓ అజ్ఞాత వ్యక్తి ఉంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిదని, విజయ్ ఆంటోని పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, దర్శకత్వం: అరుణ్‌ప్రభు.