Pallavi Dey | సినీ ఇండస్ట్రీలో విషాదం.. మరో నటి అనుమానాస్పద మృతి
Pallavi Dey | సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ వారంలోనే ఇద్దరు వర్ధమాన నటీమణులు మృతిచెందగా.. ఇవాళ మరో నటి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కోల్‌కతాలోని గార్ఫా ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లవి బాయ్‌ఫ్రెండ్‌ను కూడా పోలీసులు విచారించారు. కాగా పుట్టిన రోజునాడే కేరళలోని కాసరగోడ్‌కు చెందిన నటి, మోడల్ షహానా అనుమానస్పద స్థితిలో మరణించింది. గురువారం రాత్రి తన అపార్ట్మెంట్లోని కిటికీ ఊచలకు షహానా మృతదేహం వేలాడుతూ కనిపించింది. అయితే తన అల్లుడే షహనాను హత్య చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. ఇదిలా ఉంటే రియాలిటీ డ్యాన్స్ షో ఆట సీజన్ 1తో పాపులర్ అయిన టీనా సాధు అకస్మాత్తుగా మరణించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

