తొలిప్రేమ, హ్యాపీ, డార్లింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్లో ప్రత్యేకత చాటుకున్నారు దర్శకుడు కరుణాకరన్. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బెల్లకొండ గణేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మౌనిక రెడ్డి నిర్మిస్తున్నారు.
న్యూఏజ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి దర్శకుడు అనుదీప్ కేవీ సంభాషణలు అందిస్తుండటం విశేషం. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని.. నటీనటులు, సాంకేతిక వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.