బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ ( Bell Bottom ) మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 16న ఈ మూవీని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్లు అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ గత నెల 19న థియేటర్లలో రిలీజైంది. 1984లో జరిగిన ఓ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ కథే ఇతివృత్తంగా ఈ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాలో అక్షయ్ రా ఏజెంట్‌గా నటించాడు. బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. ఇక ఓటీటీలో సందడి చేయనుంది. డేట్ మీరు గుర్తుంచుకోండి.. మిషన్ నేను గుర్తు చేస్తా అంటూ బెల్ బాటమ్ ఓటీటీ రిలీజ్‌పై అక్షయ్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన లఢాక్‌లోని థియేటర్లోనూ ప్రదర్శితమైంది.