రేపే అవతార్ 2 విడుదల.. ఐమాక్స్‌లో బార్కోలేజర్ 3డీ గ్లాసెస్
BARCO Laser3d | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బార్కోలేజర్ 3డీ గ్లాసెస్‌ను ప్రసాద్ ఐమాక్స్ తొలిసారిగా సినీ ప్రియులకు పరిచయం చేయబోతుంది. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్ 2
BARCO Laser3d | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బార్కోలేజర్ 3డీ గ్లాసెస్‌ను ప్రసాద్ ఐమాక్స్ తొలిసారిగా సినీ ప్రియులకు పరిచయం చేయబోతుంది. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్ 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షించేలా ఈ 3డీ గ్లాస్‌ను అందించనున్నారు. శుక్రవారం విడుదలవుతున్న అవతార్ 2 సినిమాను చూసేందుకు వచ్చే సినీ ప్రేక్షకులకు ఈ గ్లాసెస్‌ను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ గ్లాసెస్‌ను బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒక్కో గ్లాసెస్ ధర రూ.4 వేలు. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పొడవైన ఐమాక్స్ తెరపై ఈ సినిమా ప్రదర్శన కాబోతుంది. 630 సీటింగ్ కెపాసిటీతో స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేశారు. కెనాడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ తయారీదారు ఆస్ట్రంగ్ ఎండీఐ ద్వారా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కోసం స్క్రీన్ ప్రత్యేకంగా రూపొందించారు. స్పీకర్లు క్యూఎస్సీ ఆడియో..ప్లేబ్యాక్ కోసం, డాల్బీ సీపీ 950 సౌండ్ ప్రాసెసర్ వాడుకలో ఉంటుందని మేనేజర్ మోహన్ కుమార్ పేర్కొన్నారు. మొత్తంగా ఈ 3డీ గ్లాసెస్‌తో ప్రత్యేక అనుభూతి కలగనుందని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

