Dimple Hayathi | నటసింహం నందమూరి బాలకృష్ణ, యువ నటి డింపుల్ హయాతి కలిసి చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం వీరిద్దరూ కలిసి ప్రయాణించడమే కాకుండా, అక్కడ దిగిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు డింపుల్ హయాతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఒకే ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణించారు. ఈ ప్రయాణ సమయంలో డింపుల్ హయాతి తన ఫోన్లో సెల్ఫీ తీయగా.. పక్కనే ఉన్న బాలయ్య చిన్న పిల్లాడిలా రకరకాల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అల్లరి చేశారు. సాధారణంగా గంభీరంగా కనిపించే బాలయ్య, ఇంత సరదాగా ఉండటాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డింపుల్ హయాతి రెండో హీరోయిన్గా నటిస్తోందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే ఈవెంట్లో కనిపించడంతో, ఈ రూమర్లు నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.