బాలకృష్ణకు తాతా అని పిలిస్తే కోపం వస్తుందట.. తన మనవళ్లు, మనవరాళ్లు ఏమని పిలుస్తారో తెలుసా?
ఈ షో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూపించింది. ఒక హీరోగా తెర మీద నటించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షోతో హోస్ట్‌గా మారి..
బాలకృష్ణ పేరు చెబితే ఇప్పుడు గుర్తొచ్చేది అన్‌స్టాపబుల్. ఈ షో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూపించింది. ఒక హీరోగా తెర మీద నటించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షోతో హోస్ట్‌గా మారి.. తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
ఆహా ప్లాట్ఫామ్లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్‌గా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. అన్ని ఎపిసోడ్స్ ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయని చెప్పేందుకు బాలకృష్ణతో ఒక వీడియో ప్లాన్ చేసింది ఆహా యాజమాన్యం.
అందులో నెవర్ హావ్ ఐ ఎవర్ అనే ఓ కాన్సెప్ట్‌తో బాలకృష్ణను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అందులో.. మీ మనవళ్లు, మనవరాళ్లు మిమ్మల్ని తాతా అని పిలిస్తే మీరు ఒప్పుకుంటారా? అని అడుగుతారు. దీంతో నోవే.. నన్ను తాతా అంటే అస్సలు ఒప్పుకోను. వాళ్లు నన్ను బాలా అని పిలవాలి అంతే.. నో గ్రాండ్‌పా.. నో తాతా అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

