Balakrishna | సెన్సేషనల్ కాంబో.. ‘జైలర్-2’లో బాలకృష్ణ?
దక్షిణాదిలో సెన్సేషనల్ కాంబోకు రంగం సిద్ధమైందా? అగ్ర హీరోలు రజనీకాంత్, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్‌పై తమ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతున్నారా? ఇప్పుడీ వార్త దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ నటించిన ‘జైలర్' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్-2’పై భారీ అంచనాలేర్పడ్డాయి.
Balakrishna | దక్షిణాదిలో సెన్సేషనల్ కాంబోకు రంగం సిద్ధమైందా? అగ్ర హీరోలు రజనీకాంత్, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్‌పై తమ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతున్నారా? ఇప్పుడీ వార్త దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్-2’పై భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఇందులో ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్రబృందం బాలకృష్ణను సంప్రదించిదట. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. తొలిభాగం ‘జైలర్’లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించారు.
ఇప్పుడు సీక్వెల్లో బాలకృష్ణ అదే తరహా పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ఆయన బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పాత్రను క్రియేట్ చేశారని అంటున్నారు. కేవలం అతిథి పాత్ర తరహాలో కాకుండా కథాగమనంలో కీలకంగా ఉంటూ పది నిమిషాల నిడివితో బాలకృష్ణ పాత్రను డిజైన్ చేశారని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదేగనుక నిజమైతే రజనీకాంత్-బాలకృష్ణ కాంబోతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

