నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. ఈ వార్త కొన్ని సంవత్సరాలుగా వైరల్ అవుతూనే ఉంది. కాని అది జరగడం లేదు. ఇంతకు ఆ హీరో ఎవరనే కదా మీ డౌట్… నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ. కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఇప్పటికే 100కి పైగా సినిమాలు చేసి నేటికీ అదే హవా నడిపిస్తున్న బాలయ్య త్వరలోనే తన కొడుకు మోక్షజ్ఞను కూడా రంగంలోకి దించబోతున్నారు.
కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ డెబ్యూ గురించి బాలయ్య ఓ ప్రకటన చేశారు. అది కూడా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు.ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.
తన తండ్రి ఎన్టీఆర్ ‘తాతమ్మకల’ అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అలాంటి మెళుకువలు నేర్పిస్తానని అన్నారు. అయితే తన తండ్రి సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి ముందు ఆయన నిర్వహిస్తున్న టాక్ షోకి హాజరు కాబోతున్నాడట మోక్షజ్ఞ. బాలకృష్ణ ఆహా కోసం అన్‌స్టాపబుల్ అనే షో చేస్తుండగా, ఈ షోలో పలువురు గెస్ట్‌లతో సందడి చేస్తున్నారు.త్వరలో మోక్షజ్ఞతోకూడా ఓ షో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నందమూరి అభిమానుల ఆనందం అవధులు దాటడం ఖాయం.