Bakasura Restaurant | ఓటీటీలోకి ‘బకాసుర రెస్టారెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Bakasura Restaurant | చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో మంచి విజయం అందుకున్న ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
Bakasura Restaurant | చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో మంచి విజయం అందుకున్న ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సన్‌నెక్స్ట్‌లో ఈ సినిమా సెప్టెంబర్12 నుంచి తెలుగుతో పాటు తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ కమెడియన్లు ప్రవీణ్ (Praveen) వైవా హర్ష (Harsha Chemudu) ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా.. ఎస్జే శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మించారు. కామెడీ ఎంటర్టైనింగ్గా వచ్చిన ఈ సినిమాలో షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్న, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పరమేశ్వర్ (ప్రవీణ్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఎలాగైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనేది పరమేశ్వర్ కల. ఒకసారి తన స్నేహితులతో ఈ విషయం చెప్పగా.. డబ్బుల కోసం యూట్యూబ్‌లో దెయ్యాల వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లుగానే వాళ్ళు చేసిన మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఒక పాడు బడిన బంగ్లాకి వెళతారు. అక్కడ వారికి ఒక మంత్రాలతో ఉన్న పుస్తకం దొరుకుతుంది. దీంతో దానిని వెంటబెట్టి రూమ్‌కి తెచ్చుకుంటారు. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా, 200 ఏళ్ల నాటి ఆత్మ ఒక నిమ్మకాయలోకి వస్తుంది. ఆ ఆత్మకు విపరీతమైన ఆకలి. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తాన్ని తినేస్తుంది.
ఆ నిమ్మకాయలోని ఆత్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు (ఫణి) శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇప్పుడు అంజిబాబు శరీరంలో ఉన్న ఆత్మను వదిలించడానికి పరమేశ్వర్ అతని స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు బక్క సూరి (వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిదే అని తెలిసిన తర్వాత పరమేశ్వర్ ఏం చేశాడు? అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Five young souls. One dark force.#BakasuraRestaurant OTT RELEASE SEPTEMBER 12 #sunnxt
The nightmare begins on 12th September Watch It On SunNXT..!!#Bakasura #UnleashTheDarkness #WatchItOnSunNXT #SupernaturalThriller #StreamingFrom12thSeptemberOnSunNXT pic.twitter.com/8jMdnGJxLI— OTT TELUGU (@GuruNat90064034) September 5, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

