న్యూఢిల్లీ: బదాయి దో ఫిల్మ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ బాలీవుడ్ సినిమాలో రాజ్‌కుమార్ రావు, భూమి పడ్నేకర్ జంటగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరూ స్వలింగ సంపర్కులు. ఇంట్లో వత్తిడి కారణంగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుంటారు. గే పోలీసు పాత్రలో రాజ్‌కుమార్.. మరో మహిళతో డేటింగ్ చేస్తున్న భూమి పడ్నేకర్ పెళ్లితో ఒక్కటవుతారు. ఇక అక్కడ నుంచి కామిడీ మొదలవుతుంది. ఇంట్లోవాళ్లను మోసగించేందుకు తెగ ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చాలా ఆసక్తికరమైన కథాంశంతో బదాయి దో సినిమాను రూపొందించారు. నవ్వులు పూయించే ఈ సినిమాలో సీమా పహ్వా, షీబా చడ్డా, లవ్లీన్ మిశ్రా, నితేశ్ పాండే, శశి భూషణ్, చుమ్ డారంగ్, దీపక్ అరోరాలు కూడా నటిస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నది. హర్షవర్ధన్ కులకర్ణి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.