‘తన కలల రాకుమారిని వెతుక్కుంటూ స్వదేశంలో అడుగుపెట్టిన బ్రహ్మచారి జీవితంలోకి ఓ అందాలసుందరాంగి ప్రవేశిస్తుంది. సొగసరి వలపు మైకంలో ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? బ్రాహ్మచారి ఓ ఇంటివాడయ్యాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అక్టోబర్ 8న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. చక్కటి ప్రణయభావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట అందరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రదీశ్ ఎమ్ వర్మ, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణ సంస్థ: జిఏ2పిక్చర్స్, దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్.