బచ్చలమల్లి భావోద్వేగ ప్రయాణం
అల్లరి నరేశ్ కామెడీ రోల్స్ ఎక్కువ చేసినా.. తను జనాల మెప్పు పొందింది మాత్రం సీరియస్ పాత్రల్లోనే. ప్రాణం, నేను, గమ్యం, శంభో శివశంభో, నాంది, మహర్షి.. రీసెంట్గా వచ్చిన ‘నా సామిరంగ’.. ఈ సినిమాలన్నింటిలో ఆయన చేసింది ఎమోషనల్ కేరక్టర్లే. అవే నటుడిగా అల్లరి నరేశ్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాయి.
అల్లరి నరేశ్ కామెడీ రోల్స్ ఎక్కువ చేసినా.. తను జనాల మెప్పు పొందింది మాత్రం సీరియస్ పాత్రల్లోనే. ప్రాణం, నేను, గమ్యం, శంభో శివశంభో, నాంది, మహర్షి.. రీసెంట్గా వచ్చిన ‘నా సామిరంగ’.. ఈ సినిమాలన్నింటిలో ఆయన చేసింది ఎమోషనల్ కేరక్టర్లే. అవే నటుడిగా అల్లరి నరేశ్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాయి.
ఈ కోవలోనే ఆయన చేస్తున్న సినిమా ‘బచ్చల మల్లి’. 1990 కాలంనాటి భావోద్వేగ ప్రయాణంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉద్వేగవంతమైన పాత్రలో అల్లరినరేశ్ కనిపించనున్నారు. సుబ్బు మంగదేవి దర్శకుడు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్లక్ పోస్టర్‌ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో, సీరియస్ లుక్‌తో అల్లరి నరేశ్ కనిపించారు. రిక్షామీద కూర్చుని సిగరెట్ తాగుతూ, మ్యాసీ హెయిర్, గడ్డంతో మాస్ ప్రేక్షకులకు మెచ్చేలా అల్లరి నరేశ్ లుక్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్, హరితేజ, వైవా హర్ష, ప్రవీణ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథనం: విప్పర్తి మధు, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

