AVAK Movie Talk | కొత్త లుక్‌లో కనిపించిన విశ్వక్ సేన్..హిట్టు పడ్డట్టేనా..?
ఎలాగైనా మరో మంచి సక్సెస్ కొట్టాలనుకున్న టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. తాజాగా అశోక వనంలో అర్జుణ కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఫలక్‌నుమా దాస్ సినిమాతో హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఆ తర్వాత చేసిన సినిమాలు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఎలాగైనా మరో మంచి సక్సెస్ కొట్టాలనుకున్న విశ్వక్ సేన్ తాజాగా అశోక వనంలో అర్జుణ కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విద్యాసాగర్ చింతా (Vidya Sagar Chinta) డైరెక్షన్ లో తెలంగాణ యువకుడికి, ఏపీ యువతికి మధ్య పెళ్లి సంబంధం నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం.
నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వడ్డీ వ్యాపారి అర్జున్ గా నటించాడు విశ్వక్ సేన్. అమ్మాయిలు దొరక్క పెళ్లికాకుండా ఇబ్బంది పడే యువకుడిగా విశ్వక్ సేన్ నటించాడు. 33 ఏండ్ల వయస్సులో విశ్వక్ సేన్‌కు గోదావరి జిల్లాలకు చెందిన మాధవి (రుక్సార్ థిల్లాన్) (Rukshar Dhillon)తో ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అయితే పెళ్లికొడుకు టీం వచ్చిన బస్సు పాడైపోవడం..వేరే ఆప్షన్ లేక వాళ్లు పెళ్లి కూతురింట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంతలోనే కోవిడ్ లాక్ డౌన్ విధించడంతో విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఎటూ వెళ్లలేక అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది.
మరోవైపు రుక్సార్ థిల్లాన్ మాత్రం తాను ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి పారిపోతుంది. రుక్సార్ ప్రేమ వ్యవహారం ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత పెళ్లికొడుకు కుటుంబసభ్యులకు తెలుస్తుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది, మధ్యలో వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ గ్యాప్‌లో రుక్సార్ థిల్లాన్ చెల్లెలు రితికా నాయక్ పెళ్లి కొడుకు విశ్వక్ సేన్‌కు దగ్గరవుతుంది. ఫైనల్‌గా ట్విస్ట్ ఇస్తూ విశ్వక్ సేన్-రితికా నాయక్ పెళ్లి జరుగడంతో శుభం కార్డు పడుతుంది.
తెలంగాణ , ఆంధ్రా ఫ్యామిలీస్ మధ్య ఉండే భావోద్వేగాలను సిల్వర్ స్క్రీన్‌పై ఫన్‌గా, ఎమోషనల్‌గా చూపించి..డైరెక్టర్ విద్యాసాగర్ చింతా మంచి మార్కులు కొట్టేశాడని అంటున్నారు సినీ జనాలు. ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కొత్తగా క్లాస్ లుక్‌లో కనిపించి..డీసెంట్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకునేలా నటించాడని టాలీవుడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

