పఠాన్’ తర్వాత షారుఖ్‌ఖాన్ ‘జవాన్’గా రాబోతున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలోనే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా కథ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తున్నది. కమల్‌హాసన్ ‘ఖైదీవేట’ సినిమా కథనే అటుఇటుగా మార్చి ఈ సినిమాను అట్లీ తెరకెక్కించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. భారతీరాజా దర్శకత్వంలో కమల్ నటించిన ‘ఖైదీవేట’ 80ల్లో పెద్ద బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు.
తండ్రి చట్టం దృష్టిలో నిందితుడు. కొడుకు పోలీస్. తండ్రిని పట్టుకోవడానికి కొడుకు ప్రయత్నిస్తుంటాడు. చివరకు తండ్రి తాను అనుకున్నది సాధించి కొడుక్కి లొంగిపోతాడు. చివరకు చనిపోతాడు. ఇంచుమించు ‘జవాన్’ కథ కూడా అలాగే సాగుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఏదిఏమైనా కథ మంచిదైనప్పుడు దాన్ని ఎన్నిసార్లు తీసినా ఫర్వాలేదు.. కొత్తగా తీస్తే చాలు జనం ఆదరిస్తారనటానికి గతంలో చాలా సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. మరి ‘జవాన్’తో షారుక్ హిట్ కొడుతాడో లేదో చూడాలి..