లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో రాబర్ట్ డి నిరో(Robert De Niro).. 79 ఏళ్ల వయసులో ఏడో బేబీకి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో తనకు ఇటీవలే ఏడో బేబీ పుట్టినట్లు చెప్పారు. అయితే పుట్టిన పాప ఆడో మగో ఎవరన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. తల్లి కూడా ఎవరన్న విషయం ఇంకా తెలియదు. రాబర్ట్ డి నీరో ప్రస్తుతం ఎబోట్ మై ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ఫిల్మ్ తర్వలో రిలీజ్‌కానున్నది. తనకు పిల్లలు అంటే ఇష్టమని ఆ హీరో తెలిపాడు.
ద గాడ్‌ఫాదర్ ఫిల్మ్‌లో నటించిన రాబర్ట్ డినిరో .. తనకు తాను కూల్ డాడ్గా భావించడంలేదన్నారు. డినిరో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య డయానా అబ్బాట్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డ్రేనా(51), రాఫెల్(46) ఆమెకు పుట్టారు. ఇక మాజీ రెండో భార్య గ్రేస్ హైటవర్కు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలియట్(25), హెలెన్(11) ఆమెకు జన్మించారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్ టౌకీ స్మిత్‌తో కవలల్ని కన్నారు. ఆరన్, జులియన్ వయసు 27 ఏళ్లు.