నరేష్ ఆగస్త్య, సంకీర్తన, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అసురగణ రుద్ర’. ఈ చిత్రం ద్వారా మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మురళీ వంశీ నిర్మాత. మెడికల్ క్రైం థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ కనులలో..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ పాటను సిద్ధార్థ్ మీనన్ ఆలపించారు. ‘ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది.