కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ- అషూ రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాలో తెగ నానుతుంది. ఈ అమ్మడు ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ చేయడానికి వెళ్లగా, ఆ సమయంలో షార్ట్ స్కర్ట్ ధరించింది. దీంతో వర్మ కళ్లు ఆమె థైస్‌పై పడడంతో ఆమెని పలు రకాలుగా ఫొటో షూట్స్ చేశాడు. వాటికి సంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాడు.
ఇంటర్వ్యూలో వర్మ-అషూ ఇద్దరు పరిచయాలు లేని వ్యకులుగా నటించారు. అషు రెడ్డిని బోల్డ్‌గా పొగిడేశాడు వర్మ. ఇక ఆఖరుకు ఆర్జీవి మాటల రిక్వెస్ట్‌లకు ఎక్కడా తగ్గని అషురెడ్డి.. చివరకు వర్మ చెంప పై ముద్దు పెట్టి షాకిచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూపై జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అషూ రెడ్డి తల్లి హుందాగా స్పందించింది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అషు రెడ్డి ఇన్స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్‌లో నెటిజన్లతో ముచ్చటిస్తుండగా.. ఇంతలో వాళ్ల అమ్మ ఎంటర్ అయ్యి.. ‘ఇంటర్వూ చూశాను, బాగుంది.. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా మెసేజ్ చెప్పావు.. సొసైటీకి మంచి మెసెజే ఇచ్చావు.. సరే బాగానే ఉంది..’ అంటూ ఆప్యాయంగా అషు బుగ్గలు నిమిరారు. దీనికి అషు ‘ఇది మా అమ్మ నా దగ్గర నుండి వచ్చిన స్వీట్ కాంప్లిమెంట్’ అంటూ వీడియో షేర్ చేసింది. ఇదే వీడియోని వర్మ షేర్ చేస్తూ.. ‘మన అణచివేత, కపట సమాజానికి కావాల్సిన తల్లిదండ్రుల్లో అశురెడ్డి తల్లి ఓ చక్కని ఉదాహరణగా ఉన్నారు. ఆధునికతకు అనుగుణంగా అందరు తల్లిదండ్రులు పిల్లలని అర్ధం చేసుకొని ముందుకు వెళ్లాలి అని ఆయన పేర్కొన్నారు.