కల్యాణ్‌రామ్ ‘అమిగోస్’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కన్నడ భామ అషికా రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తున్నదీ భామ. తాజా సమచారం ప్రకారం తిరువీర్‌తో కలిసి ఆమె ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది.
గ్రామీణ నేపథ్యంలో హాస్య ప్రధాన ప్రేమకథగా రూపొందించబోతున్న ఈ సినిమా ద్వారా రైటర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుత ఆషికా రంగనాథ్ తమిళంలో కార్తీ ‘సర్ధార్-2’లో కథానాయికగా నటిస్తున్నది. విశ్వంభర, సర్ధార్-2 చిత్రాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.