Silvina Luna | కాస్మొటిక్ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి మృతి
Silvina Luna | ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో అర్జెంటీనాకు (Argentine Actor) చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (Silvina Luna) మరణించింది.
Silvina Luna | కొందరు నటీమణులు అవకాశాల కోసం తమ అందాన్ని మరింత మెరుగు పర్చుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగానే శరీరంలోని కొన్ని భాగాలకు కాస్మొటిక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ సర్జరీ అంత సులువైంది కాదు. అందులో వాడే పదార్థాలు బెడిసికొడితే ప్రాణాలకే ముప్పు. ఇలా కొందరు ప్లాస్టిక్ సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి.
తాజాగా ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో అర్జెంటీనాకు (Argentine Actor) చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (Silvina Luna) మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. మోడల్‌గా కూడా రాణిస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అయితే సిల్వినా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం వారానికి నాలుగు సార్లు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకునేది. అయితే ఇటీవలే కాస్మొటిక్ సర్జరీ (Cosmetic Plastic Surgery) చేయించుకోవడానికి వెళ్ళింది. అయితే, దురదృష్టవశాత్తూ ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతోపాటు ఆ ప్రభావం తన కిడ్నీ సమస్యపై మరింత ఎఫెక్ట్ పడిండి. ఈ క్రమంలో కొన్నిరోజులపాటు ప్రాణాలతో పోరాడిన సిల్వినా చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు.
Also Read..
Mumbai Local Train | లోకల్ ట్రైన్లో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో
Uday Kotak | కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ రాజీనామా
Joe Biden | జీ20 సమ్మిట్‌కు రెండు రోజుల ముందే భారత్ రానున్న బైడెన్.. 8న ప్రధానితో ప్రత్యేక భేటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

