This Week Theater/Ott Releases | ఏప్రిల్ నెల ఏంటీ చప్పగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ‘విరూపాక్ష’ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కళ తీసుకొచ్చింది. ‘దసరా’ తర్వాత దాదాపు మూడు వారాల వరకు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే సినిమాలే రాలేవు. ఇక గతవారం ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన విరూపాక్ష తొలిరోజు నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ వారం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి భారీ సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్ధాం.
ఏజెంట్:
ఇండస్ట్రీకి వచ్చి ఎనిదేళ్లవుతున్నా అఖిల్ ఇంకా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోతున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఏజెంట్’ సినిమాపైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పొన్నియన్ సెల్వన్-2:
మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఒకటి. చియాన్ విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. గతేడాది సెప్టెంబర్ చివరివారంలో రిలీజైన పార్ట్-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చింది. దాంతో పార్ట్-2పై మరింత అంచనాలు పెరిగాయి.
రారా పెనిమిటి:
ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై కాస్తో కూస్తో మంచి అంచనాలే క్రియేట్ చేసింది.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
అమెజాన్ ప్రైమ్:
పాతు తలా (తమిళ సినిమా) – ఏప్రిల్ 27
సిటాడెల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
సేవ్ ద టైగర్స్ (తెలుగు వెబ్ సిరీస్) – ఏప్రిల్ 27
వేద్ (మరాఠీ మూవీ) – ఏప్రిల్ 28
పీటర్ పాన్ అండ్ వెండీ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 28
డాక్టర్ రొమాంటిక్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 28
నెట్‌ఫ్లిక్స్:
దసరా (తెలుగు సినిమా) – ఏప్రిల్ 27
ద నర్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 27
స్వీట్ టూత్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 27
ద మ్యాచ్ మేకర్ (అరబిక్ మూవీ) – ఏప్రిల్ 27
కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ద గోల్డెన్ టచ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28
యోయో హనీ సింగ్ (హిందీ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 28
మ్యూయి: ద కర్స్ రిటర్న్స్ (వియత్నమీస్ సినిమా) – ఏప్రిల్ 30
జీ5:
యూటర్న్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 28
వ్యవస్థ (తెలుగు సిరీస్) – ఏప్రిల్ 28
సోనీ లివ్:
తురుముఖమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 28