AP Movie Ticket Prices | టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్..ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ
ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది.
టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది. తాజా జీవో ప్రకారం టికెట్ కనిష్ట ధర రూ.20గా, గరిష్ట ధర రూ.250గా నిర్ణయించింది. ప్రాంతాన్ని బట్టి థియేటర్లను 4 రకాలుగా విభజించి తాజా టికెట్ల ధరలను నిర్ణయిచింది.
అయితే ఈ టికెట్ల రేట్లకు జీఎస్టీ ధరలు అదనం. ఒక్కో థియేటర్లలో రెండు రకాల టికెట్ల రేట్లుండగా..వాటిని ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్లను నిర్దారించారు. ప్రతీ థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం సీట్లకు కేటాయించాలని ఆదేశించింది ప్రభుత్వం. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.
టికెట్ల ధరలను కనీసం 10 రోజులు పెంచుకునే వీలు కల్పించింది. అయితే 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే తాజా రేట్ల పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. దీంతోపాటు రోజుకు ఐదు షోల్లో ఒక చిన్న సినిమా వేయాలని నిర్దేశించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పాత జీవో నంబర్ 35 రద్దైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్యామ్‌తోపాటు మిగిలిన చిత్రాలకు ఊరట లభించినట్టైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

